... గాయాలు
వంశీ కలుగోట్ల // ... గాయాలు // ****************************** * కొన్ని గాయాలు గుర్తులుగా మిగిలిపోతుంటాయి నడక నేర్చుకునేటప్పుడో అడుగులు తడబడినప్పుడో నడవడిక సరిగా లేకనో గాయాలు అవుతుంటాయి అవి గుర్తులుగా మిగిలిపోతాయి * * * కొన్ని గాయాలు వెంటాడుతూనే ఉంటాయి కాలం మరచిపోతుందేమో కానీ, హృదయం మరచిపోలేని గాయాలు కొన్నుంటాయి ప్రేమ ఓడిపోయో బంధం విడిపోయో స్నేహం మాటున ద్రోహమో హృదయానికి తగిలే గాయాలు వెంటాడుతూనే ఉంటాయి ఎప్పటికీ * * * కొన్ని గాయాలు గేయాలవుతుంటాయి ఒక్కొక్కడు ఒక్కో రకం పక్కోడికి దెబ్బ తగిలినా పువ్వు నలిపేయబడినా ప్రపంచం బాధని తమ బాధలా భావించే భావుకులుంటారు బాధను అనుభవిస్తూ గేయాలు స్రవిస్తుంటారు * ...