ఒక ప్రయాణం ...
వంశీ కలుగోట్ల// ఒక ప్రయాణం ... //
************************************
తడబడుతున్నా నిలబడుతూ ******************************
ప్రవహించే నదిలా
పల్లం వైపు పారిపోతున్నా
పతనమో లేకపోతే
పరిణామక్రమమో అర్థం కాకపోయినా
అడుగు అడుగుకూ
చీకట్లు ముసురుకొస్తూంటే
అర్ధమనస్కపు సంకల్పంతో
సంధికాలపు సంధ్య వెలుగుల కోసమై
పల్లం వైపు పరిగెడుతున్నా
బతుక్కూ చావుకూ మద్య
మిగిలున్న మానవత్వాన్ని అనుభవించి
దోసెడు నవ్వులనూ
పిడికెడు జీవితాన్నీ
సంచీలో నింపుకు వెళదామని ప్రయత్నంలో
అగాథంలోకో శిఖరం మీదకో
అర్థం కాకపోయినా పరిగెడుతూనే ఉన్నా
అనేకుడిగా విడిపోయిన నేను
పునరేకీకృతం కావాలనే ప్రయత్నంలో
చీకటిలోంచో లేక చీకటిలోకో
అర్థం కాని అయోమయపు ప్రయాణం
Comments
Post a Comment